గడప గడపలో సంక్షేమ పథకాలు

అర్హులందరికీ అందివ్వడమే మా లక్ష్యం
 

అర్హతే ప్రామాణికంగా పథకాల అమలు

  ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో సంతోషం

 ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ స్పష్టీకరణ

 ఎచ్చెర్ల‌: గడప గడపలో సంక్షేమ పథకాలు అందుతున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం పెంట సచివాలయం పెంట గ్రామంలో గడపగడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 93వ రోజు  ఉదయం 7:30గంటల నుంచి 11:30గంటల వరకు 316 గడపల ప్రజలను   ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నేరుగా క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా  ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ..అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని, మూడేళ్లలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ఆయా పథకాలతో మూడేళ్లుగా కలిగిన లబ్ధిని ప్రజలకు తెలియజేశారు. స్థానికంగా సమస్యలను ప్రజలతోనే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఏ గడపకు వెళ్లినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా అనంత తెలిపారు.ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పేద,బడుగు,బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఉన్నాయని,ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం,అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.అనంతరం సచివాలయ సిబ్బంది,వాలంటీర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.ఏ ఒక్క అర్హుడికి పథకాలు రాకుండా ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు.

ఈ కార్యక్రమంలో జి.సిగడాం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ,జడ్పీటీసీ కాయల రమణ,బూత్ కమిటీ కన్వీనర్ ఆబోతుల జగన్నాథం,వైస్ ఎంపీపీ తోలేటి వెంకటరావు,మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మక్కా వెంకటసాయి,సిగడాం పీఏసీఎస్  చైర్మన్ ఎర్నేని ప్రకాష్,ఎచ్చెర్లమార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలి అప్పలసూరి,పెంట సర్పంచ్ పున్నాన సోనియా,నాగులవలస సర్పంచ్ బత్తుల నాని, ఎంపీటీసీ మక్కా శ్రీలత, నాయకులు పున్నాన అక్కల నాయుడు, మక్కా శ్రీనువాసరావు, వైస్ సర్పంచ్ సత్యనారాయణ, అలుగోలు శ్రీనువాసరావు,మీసాల శ్రీనువాసరావు,బత్తులచంద్రరావు, ఇనుగుంటి పాండురంగారావు,పెంట,  నాగులవలస పంచాయతీ వార్డు మెంబర్లు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top