వైయస్‌ఆర్‌ సీపీ నుంచి డీ.వై.దాస్‌ సస్పెండ్‌

తాడేప‌ల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ శాస‌న‌స‌భ్యులు డీ.వై.దాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు డీ.వై.దాస్‌ను సస్పెండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. 

 

Back to Top