సభా సాంప్రదాయాల గురించి టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరం

డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి 
 

అసెంబ్లీ: సభా సాంప్రదాయాల గురించి ఈ రోజు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి మాట్లాడుతుంటే..మాకు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి అన్నారు. . అచ్చెన్నాయుడు గతంలో ఇదే ప్రాంతంలో కూర్చునేవారు. ఆ రోజు ప్రతి పక్ష నాయకుడిగా ఉన్న వైయస్‌ జగన్‌ను అచ్చెన్నాయుడు అన్న మాటలు చెప్పాలంటే నాకు సంస్కారం గుర్తోస్తోంది. మహిళా ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాను ఆరోజు అన్యాయంగా సస్పెండ్‌ చేశారు. కోర్టు ఆర్డర్‌తో అసెంబ్లీలోకి వస్తుంటే అడ్డుకుని గేటు వద్ద కూర్చోబెట్టారు. మీడియాను రాకుండా నియంత్రించిన పెద్దలు వారు. నిండుసభలో మార్షల్‌ వచ్చి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎత్తుకెళ్లారు.ఇంతదారుణంగా ఆ రోజు సభలో ప్రవర్తించిన నేతలు ఇవాళ సభా సంప్రాదాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
 

Back to Top