రికార్డుస్థాయిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తాం

లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు లబ్ధిదారులను గుర్తిస్తున్నామన్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 20 లక్షల 50 వేల మంది లబ్ధిదారుల గుర్తించామన్నారు. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో 8.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 7 లక్షల మందిని గుర్తించామన్నారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులను 5 లక్షలకు పైగా గుర్తించాం. ఇంకా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారని చెప్పారు.  ఇళ్ల స్థలాల కోసం 19 వేల ఎకరాలు రూరల్‌లో, పట్టణాల్లో 2,500 ఎకరాలు గుర్తించామన్నారు. ఇంకా 19 వేల ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. దాదాపు రూ. 10 వేల కోట్లతో భూమిని సమీకరిస్తున్నామని చెప్పారు. ఒకేసారి ఇన్ని లక్షల పట్టాలు ఇవ్వడం దేశంలో మొదటిసారి అవుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ ఖచ్చితంగా ఈ రికార్డు సాధిస్తారన్నారు.

Read Also: చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు

 

తాజా వీడియోలు

Back to Top