కొన్ని దుష్ట‌శ‌క్తులు రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టిస్తున్నాయి

డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌
 

శ్రీ‌కాకుళం:  కొన్ని దుష్ట‌శ‌క్తులు రాష్ట్రంలో కులాలు, మ‌తాల పేరుతో అల‌జ‌డి సృష్టిస్తున్నాయ‌ని డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మండిప‌డ్డారు. టీడీపీని ప్ర‌జ‌లు మ‌రిచిపోతున్నార‌న్న భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌న్నారు. రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని తెలిపారు.  రామతీర్థం ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించార‌ని చెప్పారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను సైతం తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.    

Back to Top