విశాఖ: రాజకీయాల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని రాష్ట్ర డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు కేబినెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17మందికి చోటు కల్పించడమే కాకుండా, దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. పురపాలిక, కార్పొరేషన్ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి, రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ఇంత గౌరవంగా మీ ముందు ఉండేలా చేశారు. అలాగే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అసెంబ్లీ స్పీకర్‌గా, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి మండలి ఛైర్మెన్ గా ఎంపిక చేసిన ఘనత కూడా జగన్ గారికే దక్కుతుంది. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌గారు ప్రమాణ స్వీకారం చేయగానే, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు చెందిన 80 శాతం మందికి నవరత్నాలు అందించారు. చక్కటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడం గర్వకారణం. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రిగారి ఆలోచనా విధానాన్ని, సామాజిక న్యాయాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రజలకు వివరించడమే మా బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశం.