మరో 30 ఏళ్ళు వైయ‌స్ జగన్ గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి

రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా
 
సామాజిక న్యాయం చేసిన నాయకుడిగా జగన్ గారు చరిత్రలో నిలిచిపోతారు

విశాఖ‌: మరో 30 ఏళ్ళు వైయ‌స్ జగన్ గారే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటార‌ని రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ల అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తమకు సామాజిక న్యాయం చేయాలని అనేక సందర్భాల్లో మొర పెట్టుకున్నా... ఎక్కడా, ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు గతంలో ఎన్నడులేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మంత్రివర్గంలో 70శాతం  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వాళ్లు లేరని గర్వంగా చెప్పగలం. కేవలం కేబినెట్‌లోనే కాకుండా నామినేటెడ్‌ పదవుల్లోనూ అవకాశం కల్పించి రాష్ట్రంలో పూర్తి సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్ గారు.

 మైనార్టీల సంక్షేమం గురించి చూస్తే.. గతంలో చంద్రబాబు హయాంలో మైనార్టీలకు కేబినెట్ లో ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మైనార్టీ మంత్రి లేని కేబినెట్ ఒక్క చంద్రబాబు హయాంలోనే.   తన అయిదేళ్ల పాలనలో చంద్రబాబు తన మంత్రివర్గంలో మైనార్టీలు, ఎస్టీలకు స్థానం కల్పించలేదు. కేవలం ఎన్నికల తరుణంలో మాత్రమే మూడు నెలల కోసం మైనార్టీలకు మంత్రిపదవి ఇచ్చారు.

 ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డిగారు.. కచ్చితంగా ఈ రాష్ట్రానికి మరో 30ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటారు. అప్పుడే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మనసున్న ముఖ్యమంత్రి జగన్ గారికి రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలి.

తాజా వీడియోలు

Back to Top