ఇక నిరుద్యోగ సమస్య ఉండదు

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా
 

వైయస్‌ఆర్‌ జిల్లా: ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు మాసాల్లోనే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్‌ బాషా అన్నారు. మూడేళ్లలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేసి కచ్చితంగా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య తీర్చాలి.. జిల్లాను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి స్టీల్స్‌ ప్రారంభించారన్నారు. ఆ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్న తరుణంలో ఆ మహానేత అకాలమరణం చెందారని, వైయస్‌ఆర్‌ మరణం తరువాత పనులు నిలిచిపోయాయన్నారు. జిల్లా ముద్దుబిడ్డ సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో నేను విన్నాను.. నేను ఉన్నానని భరోసానిస్తూ ఆరు నెలల్లోనే స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తానని చెప్పారని, ఇచ్చిన మాటకు కట్టుబడి శంకుస్థాపన చేశారన్నారు. మూడేళ్లలో స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి చేసి రాయలసీమ ప్రాంతంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తారన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్రభుత్వం వైయస్‌ఆర్‌ కడప జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా భావిస్తున్నామని, ఐదేళ్ల కాలంలో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top