ఏలూరు టూటౌన్‌లో డిప్యూటి సీఎం ఆళ్లనాని పర్యటన

డిశ్చార్జ్ అయిన బాధితుల‌కు మంత్రి ప‌రామ‌ర్శ‌

పశ్చిమ గోదావరి: ఏలూరు టూటౌన్‌లో డిప్యూటి సీఎం ఆళ్ల నాని పర్యటించారు.తంగెళ్లమూడిలో అస్వస్థతకు గురై డిశ్చార్జ్‌ అయిన బాధితులను మంత్రి పరామర్శించారు.బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.తంగెళ్లమూడిలో శానిటేషన్, వైద్య శిబిరాలను పరిశీలించారు. కాగా, ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇక ఇప్పటి వరకు 612 మంది అనారోగ్యం పాలవ్వగా 569 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఏలూరు ఆస్పత్రిలో ఏడుగురు బాధితులు.. విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 35 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రత్యేక వార్డుల్లోని బాధితులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

Back to Top