ప్ర‌భావిత ప్రాంతాల్లో డిప్యూటి సీఎం ఆళ్ల‌నాని ప‌ర్య‌ట‌న‌

ఏలూరు:  వింత వ్యాధి ప్ర‌భావిత ప్రాంతాల్లో డిప్యూటి సీఎం ఆళ్ల‌నాని బుధ‌వారం ఉద‌యం ప‌ర్య‌టించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన వైద్య‌శిబిరాలు, శానిటేష‌న్ ప‌నుల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. ఏలూరులో బాధితులను స్వయంగా పరామర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top