మహత్తర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
 

గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వ్యాధిగ్రస్తులకు ఆసరాగా నిలబడి చేయూతను అందించేందుకు వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా అనే మహత్తరమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఎంతోమంది పేదలకు ప్రాణభిక్ష పెట్టిందన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని భ్రష్టుపట్టించి, పేద ఆరోగ్యానికి కేటాయించే నిధులను పక్కదోవ పట్టించారు. ప్రజలందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన వైయస్‌ జగన్‌ ఆరోగ్యశ్రీలో సమూల ప్రక్షాళన చేసి పేదలందరికీ చేరువకు తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీలో పేదలకు సుమారు 836 వ్యాధులకు సంబంధించి ఆపరేషన్లు జరిగితే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.. అలాంటి పరిస్థితుల్లో కూడా శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి రోజుకు రూ.225 చొప్పున భృతి ఇవ్వడంతో పాటు నెలల విశ్రాంతి అయితే అన్ని నెలలు ఆ కుటుంబాలను పోషించే బాధ్యత కూడా సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్నారన్నారు.

Read Also: మా నాయకుడని చెప్పుకుని గర్వపడుతున్నాం

Back to Top