ద్రోణంరాజు కుటుంబానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అండగా ఉంటారు

ద్రోణంరాజు సంస్మరణ సభలో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ కుటుంబానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  మంగళవారం విశాఖలోని ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో ద్రోణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయ‌‌సాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, ఎంవీవీ సత్యనారాయణ.. సత్యవతి, గుడివాడ అమర్‌నాథ్‌, అదీప్‌రాజు, గొల్ల బాబూరావు, భాగ్యలక్ష్మి, కార్యకర్తలు పాల్గొని ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మనసులో ద్రోణంరాజు శ్రీనివాస్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చివరిసారిగా తనకు ద్రోణంరాజు శ్రీనివాస్ ఫోన్ చేసి శ్రీవత్సవను బాగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు.  శ్రీవత్సవ తన తండ్రి బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని అన్నారు. 

మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని, విశాఖ నగరంతో విడదీయరాని బంధం ద్రోణంరాజు కుటుంబానికి ఉందని తెలిపారు. పార్టీ తరుఫున ద్రోణంరాజు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.  మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ద్రోణంరాజు సంస్మరణ సభలో పాల్గొటనని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనే మనుషులను ఎన్నడూ సీఎం వైయ‌స్ జగన్‌ వదులుకోరని తెలిపారు. వైయ‌స్, ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ద్రోణంరాజు ఓడిపోయినప్పటికీ సీఎం వైయ‌స్ జగన్  వీఎంఆర్డీఏ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారని చెప్పారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌ తమకు అండగా నిలిచారు

నాన్న ఆరోగ్యం గురించి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎప్పటికప్పుడు ఆరా తీశారని శ్రీ‌నివాస్‌ కుమారుడు శ్రీవత్సవ అన్నారు. తన తండ్రి అనారోగ్యానికి గురైతే.. పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని గుర్తుచేశారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ తమకు అండగా నిలిచారని తెలిపారు. పార్టీలో ఆలస్యంగా చేరిన తన తండ్రికి సీఎం వైయ‌స్ జగన్‌ ఎమ్మెల్యే సీటు ఇచ్చారని గుర్తుచేశారు. తన నాన్న ఆరోగ్యం గురించి ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీశారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు తన తండ్రి చనిపోయారని అన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top