తిరుప‌తి ఉప ఎన్నిక‌లో గురుమూర్తి చ‌రిత్ర సృ‌ష్టిస్తారు

ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

చిత్తూరు:  తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్‌ గురుమూర్తి అఖండ విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టిస్తార‌ని ప్ర‌భుత్వ విప్‌, తుడా చైర్మ‌న్‌, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.  వైయ‌స్సార్‌సీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డాక్టర్‌ ఎం.గురుమూర్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  త‌న విజ‌యానికి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని గురుమూర్తి కోరారు. ఈ సంద‌ర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న‌రంజ‌క పాల‌న తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బంప‌ర్ మెజారిటీతో విజ‌యానికి దోహ‌దం చేస్తుంద‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులంద‌రం ఐక‌మ‌త్యంతో క‌లిసిక‌ట్టుగా గురుమూర్తి అఖండ విజ‌యానికి కృషి చేస్తామ‌ని భాస్క‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top