ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

 
తాడేపల్లి: కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లలిత జ్యువెలర్‌ సీఎండీ కిరణ్‌కుమార్ బుధవారం‌  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో విరాళం చెక్కును అందచేశారు.

►అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జీ. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000 విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సమక్షంలో డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి (గుండ్లకుంట), డాక్టర్ ఎంఎల్‌ నారాయణరెడ్డి (జమ్ములమడుగు) విరాళం చెక్కును సీఎం వైయస్‌ జగన్‌కు అందచేశారు. 

►కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000 విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం జగన్‌కు ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్ అందించారు.

►అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000 విరాళం ప్రకటించింది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ విరాళానికి సంబంధించిన డీడీని ముఖ్యమంత్రి అందచేశారు.

►మరోవైపు​ ముఖ్యమంత్రి సహాయనిధికి అసోసియేషన్ ఆఫ్ ఫార్మర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు (ఏపీ, తెలంగాణ) రూ. 6,15,000 విరాళం ఇచ్చింది.

Back to Top