సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 32 మందికి బాధిత కుటుంబాలకు చెక్కులను  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (విద్య) సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి  చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలు ఆపదలో ఉంటే ‘నేనున్నాను’ అని ఆదుకోవడం ముఖ్యమంత్రి జగనన్న మంచి మనసుకు నిదర్శనమని అన్నారు.

పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేదా ఆరోగ్య పరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావల్సిన డబ్బులు లేకపోవడం, వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్యేకు విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారు. 
అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 32 మంది బాధిత కుటుంబ సభ్యులకు వచ్చిన 24 లక్షల 87 వేలు రూపాయలను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అందజేశారు.

Back to Top