విదేశీ విద్యాదీవెన దేవుడిచ్చిన వరం

డిప్యూటీ సీఎం, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి పి. రాజన్న దొర

తాడేప‌ల్లి:   జ‌గ‌న‌న్న‌ విదేశీ విద్య దీవెన దేవుడిచ్చిన వరమ‌ని డిప్యూటీ సీఎం, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి పి. రాజన్న దొర వ్యాఖ్యానించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో అర్హులైన 357 మంది విద్యార్ధులకు తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్లు జమ చేశారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం రాజ‌న్న దొర మాట్లాడారు.

దేవుడు ఎక్కడున్నారో కనిపించరు కానీ దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలు, మైనార్టీలకు కనిపిస్తున్న దేవుడు వైయ‌స్‌ జగన్, ఢిల్లీ ఎక్కడుందో తెలియని మాకు విదేశాలలో యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం కల్పించినవారిని దేవుడు కాక ఇంకేమనాలి. గిరిజనులు కొండల్లో అడవుల్లో నివసించేవారు, వారికి కూడా విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించిన సీఎంగారికి గిరిజన జాతి అంతా రుణపడి ఉంటుంది. మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు, చంద్రబాబు గానీ మరోసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి,  మేం చేస్తున్నదేంటి, మీరు చేస్తున్నదేంటి, సీఎంగారికి మా అందరి తరపున మరోక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్యూ. 

ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం: సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున 
ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఒక చారిత్రాత్మక నిర్ణయం, ఈ రోజు ప్రతిపక్షం విదేశీ విద్య తీసేశారని చెబుతోంది, కానీ ఇదివరకు ఎస్సీ, ఎస్టీలకు రూ. పదిహేను లక్షలు, ఇతరులకు రూ. పది లక్షలు ఇచ్చేవారు, ఇదివరకు అప్పులు చేసి, తాకట్టు పెట్టి విదేశాలకు వెళ్ళేవారు, గతంలో చాలా అవకతవకలు జరిగాయి, అవన్నీ మార్చి పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదని మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇది ఒక గొప్ప ఆలోచన, ప్రతిపక్షాలకు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నాయి, విదేశాలలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలలో చదవడం దార్శనికతకు నిదర్శనం, ప్రతిపక్షాలు అభూతకల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.

 గొప్ప యూనివర్శిటీలో చదవడం కలగా ఉండేది: షేక్ అమియా మొబీన్, విద్యార్ధిని, నెల్లూరు

గుడ్ మార్నింగ్ సార్, నేను అడ్వకేట్ల కుటుంబం నుంచి వచ్చాను, నేను బీకామ్ ఎల్ఎల్బీ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించాను, నేను క్వీన్ మేరి యూనివర్శిటీలో మాస్టర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాను, నా ఆర్ధిక పరిస్ధితుల వల్ల ఇంత గొప్ప యూనివర్శిటీలో చదవడం కలగా ఉండేది, కానీ ఈ స్కీమ్ ద్వారా నేను లబ్ధి పొందాను, నాకు రూ. ఇరవై ఎనిమిది లక్షల పదివేలు శాంక్షన్ అయ్యాయి. ఇందులో ఎయిర్ ఫేర్, వీసా చార్జీలు కూడా ఉన్నాయి, టాప్ యూనివర్శిటీలలో చదువుకోవడం గొప్ప అవకాశం, మా మైనార్టీ కమ్యూనిటీ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, నేను భవిష్యత్లో నా వంతుగా సమాజానికి ఉపయోగపడతాను, వచ్చే జనరేషన్స్ కి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ధ్యాంక్యూ సార్. 

 గొప్పగా భావిస్తున్నా: సుష్మశ్రీ, విద్యార్ధిని, మదనపల్లె, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో సీట్ సాధించిన విద్యార్ధిని

గుడ్ మార్నింగ్ సార్, నేను సివిల్ ఇంజినీరింగ్ మదనపల్లెలో చదివాను, మా కుటుంబ నేపథ్యం కూడా ఆర్ధికంగా వెనకబడిన వారే, మా కుటుంబంలో ఎవరూ ఉద్యోగస్తులు కూడా లేరు, ఈ నేపధ్యంలో మా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను, కానీ గొప్ప యూనివర్శిటీలలో చదివించే స్ధోమత మా కుటుంబానికి లేదు. విద్య అనేది మాత్రమే సమాజంలో పేరు, ప్రతిష్టలు నిలుపుతాయని నమ్మాను, లండన్ యూనివర్శిటీలో సీట్ సాధించడం నేను గొప్పగా భావిస్తున్నాను. ఇది నా కెరియర్లో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ స్కీమ్ లో నేను లబ్ధిపొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను, నేను నా కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత దేశానికి, ప్రజలకు సేవ చేస్తాను. నాకే కాదు నాలాంటి అనేక మంది పేద విద్యార్ధులక ఈ స్కీమ్ ఒక వరం. ధ్యాంక్యూ సార్. 

ఏపీలో ఉంటే  మేం కూడా చదువుకునే వాళ్ల‌మ‌ని నా ఫ్రెండ్స్ అంటున్నారు: చరణ్ కుమార్ రెడ్డి, విద్యార్ధి, న్యూయార్క్ యూనివర్శిటీలో సీట్ పొందిన విద్యార్ధి

గుడ్ మార్నింగ్ సార్, నేను నా అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత న్యూయార్క్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతానని కలలో కూడా ఊహించలేదు. ఈ స్కీమ్ గురించి తెలియగానే దరఖాస్తు చేసుకున్నాను, అంతా పారదర్శకంగా జరిగింది, నేను ఎక్కడా ఇలాంటి స్కీమ్ చూడలేదు, నా అండర్ గ్రాడ్యుయేషన్ తెలంగాణలో చదువుకున్నాను, నా ఫ్రెండ్స్ కూడా ఈ స్కీమ్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు, వారు మేం ఏపీలో ఉంటే ఈ స్కీమ్ ద్వారా చదువుకునే వారనుకున్నారు, నా కోర్సు పూర్తవగానే ఏపీకి వచ్చి ఇక్కడ అభివృద్దిలో భాగస్వామిగా ఉంటానని మాట ఇస్తున్నాను. ధ్యాంక్యూ సార్.

 

Back to Top