సమర్థ నాయకుడు సీఎంగా ఉండటం మన అదృష్టం

బీసీలు తలెత్తుకొని జీవించేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

ఇలాంటి నాయకుడిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే

చంద్రబాబు కుట్ర రాజకీయాలపై కలిసికట్టుగా పోరాడుదాం

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

విజయవాడ: సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. గతంలో ఎంతో నిర్లక్ష్యానికి గురైన బీసీలంతా.. నేడు సమాజంలో గౌరవంగా తలెత్తుకొని జీవించేలా, అన్నింటా ముందుండే స్థితిని సీఎం వైయస్‌ జగన్‌ కల్పించారన్నారు. ఇలాంటి గొప్ప నాయకుడిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ సోదరసోదరీమణులపై ఉందన్నారు. బీసీ సంక్రాంతి సభలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొని మాట్లాడారు. 

బలహీనవర్గాల ఓట్లతో అధికారం చేపట్టిన చంద్రబాబు.. వెన్నుపోటు పొడిచి బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మండిపడ్డారు. ఈనాడు బీసీలు తలెత్తుకొని జీవించేలా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు వంటి ఉన్నత పదవులు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. రాష్ట్రానికి నాలుగు రాజ్యసభ స్థానాలు వస్తే.. రెండు స్థానాలు బీసీలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తుచేశారు. కేబినెట్‌లో ఏడు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి రాష్ట్రంలోని అందరూ నాకు సమానమేనని చాటిచెప్పారన్నారు. 

సమాజంలో గౌరవాన్ని పెంచే నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఇలాంటి నాయకుడిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కుతంత్రాలు, కుట్రలతో చంద్రబాబు చేస్తున్న విష ప్రయోగాలను అణగదొక్కాలని, బీసీలంతా కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా నడం బిగించి పోరాడాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. 

Back to Top