ఏ అర్హతతో బాబు జిల్లాలో ప్రాజెక్టుల పర్యటనకు వస్తున్నారు

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

వైయ‌స్ఆర్ జిల్లా: ఏ అర్హతతో చంద్ర బాబు జిల్లాలో ప్రాజెక్టుల పర్యటనకు వస్తున్నార‌ని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్ర‌శ్నించారు. క‌డ‌ప నగరంలోని వైయ‌స్ఆర్ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, డాక్టర్ సుధ, గడి కోట శ్రీకాంత్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు.  ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ..పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దని వ్యతిరేకంగా ప్రకాశం బ్యారేజి దగ్గర ధర్నా చేసిన దేవినేని ఉమ కు మంత్రి ఇచ్చింది చంద్ర‌బాబు కాదా అని ప్ర‌శ్నించారు. టిడిపి హయాంలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని నిల‌దీశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకు వచ్చింది ఎన్టీఆర్ .. 1989-1994 మ‌ధ్య కొంత వరకు పనులు జరిగాయి..1994 నుంచి 2004 వరకు చంద్ర‌బాబు ఏమీ చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  టిడిపి చరిత్ర ఏమిటో అంద‌రికీ తెలుసు అన్నారు. గతంలో  ర‌ఘురామిరెడ్డి ఓటమికి ఎమ్మెల్యే వీర శివారెడ్డి, వీరారెడ్డి కారణ మయ్యారు.. అప్పుడు ఎన్టీఆర్ వారిని టిడిపి నుంచి సస్పెండ్  చేశారు. ర‌ఘురామిరెడ‌డ్ఇ టిడిపి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు తెలుగు గంగ పనులు పూర్తి చేయాలని కోరితే నిర్లక్ష్యంగా చంద్ర బాబు వ్యవహ రించారు.

తొమ్మిదేళ్ళ ముఖ్య మంత్రి గా ఉండి తెలుగు గంగను ఎందుకు పూర్తి చేయలేద‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టు లను పూర్తి చేసి యుద్ద ప్రాతిపదికన సాగు నీరు అందించార‌ని గుర్తు చేశారు. మ‌హానేత వైయ‌స్ఆర్ మ‌ర‌ణం తరువాత చంద్రబాబు ఐదేళ్లలో రాయలసీమకు ఏమీ చేశారో చెప్పాల‌ని డిమాండు చేశారు. వైయ‌స్ జగన్ వచ్చాక 500 కోట్లు ఖర్చు పెట్టి 5 టీఎంసిల నీరు ఇచ్చార‌ని తెలిపారు. 2014-15 లో 4.5  టి ఎంసి లు, తరువాత 2.8 టిఎంసి నీరు నిల్వ పెట్టారు.. బ్రహ్మంసాగర్ లో 17 టి ఎం సీల నీరు నిల్వ చేశార‌ని వివ‌రించారు. బ్రహ్మం సాగర్ నీరు పుష్కలంగా ఉంది.. పంట కాలువకు నీరు ఇచ్చే అవకాశం ఉంద‌న్నారు. కేసికి నీరు ఇవ్వాలని గత ప్రభుత్వంలో ఆందోళనలు చేశార‌ని, వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలో కి వచ్చాక కేసి కాలువకు సకాలంలో నీరు ఇచ్చి రైతుల మొహంలో ఆనందం చూస్తున్నామ‌ని చెప్పారు. రైతుల పైన వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందో అర్థ‌మ‌వుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌జాప్ర‌తినిధులు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top