ఆశా వర్కర్ల వేతనం రూ.10 వేలకు పెంచాం

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

అసెంబ్లీ: అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపే ఆశా వర్కర్ల వేతనాలను రూ.10 వేలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌సెంటీవ్స్‌ రూపంలో ఇచ్చే రూ.3226ను ఏకంగా నికర వేతనంగా పదివేల రూపాయలకు సీఎం వైయస్‌ జగన్‌ పెంచారన్నారు. ఆశా వర్కర్లు ఎంతగా మొరపెట్టుకున్నా.. గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని గుర్తుచేశారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆశా వర్కర్లు వారి బాధను వ్యక్తపరిచారని, అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి వచ్చిన రెండు నెలలోపే ఆశా వర్కర్లకు సంబంధించి వేతనం రూ.10 వేలకు పెంచారన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top