చంద్రబాబు దత్త పుత్రుడు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే వచ్చాడు

 డిప్యూటీ సీఎం అంజాద్ బాషా 

 కడప జిల్లాలో కులాలు లేవు, మతాలు లేవు.. అందరూ ఒకటే ఆన్న విధంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోంది..

  వైయ‌స్ఆర్ సిపి అధికారంలో కి వచ్చాక రైతుల కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం

  రైతు విత్తనం మొదలు గిట్టు బాటు ధర వరకు సాయం అందిస్తోంది..

 గత చంద్రబాబు ప్రభుత్వoలో రైతులు అత్మ హత్యలు చేసుకున్నా, సాగు నీళ్ళు లేకపోయినా ఎందుకు ప్రశ్నించ లేదు..?

 ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్..

 బాబుతో  ప్యాకేజీ కుదిరాక పర్యటనల పేరుతో విమర్శిస్తున్నారు..

వైయ‌స్ఆర్ జిల్లా: చంద్రబాబు దత్త పుత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కులాల మధ్య చిచ్చు పెట్టడానికే వచ్చాడ‌ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమ‌ర్శించారు. గత టిడిపి ప్రభుత్వంలో 45 వేల బెల్టు షాపులు పెట్టీ, మద్యం ఏరులై పారి నప్పుడు.. పవన్ ఎందుకు అప్పుడు మాట్లాడలేదు..? మా ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేసింది.. బార్లు తగ్గించాము.. పర్మిట్ రూములను తొలగించాము.. ఇది తెలియక పవన్ మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

 సొంతంగా పార్టీ పెట్టీ, ప్రజా బలం తో అధికారంలోకి వేస్తే వారసత్వ రాజకీయాలు అనడం ఏమిటి..?
నువ్వు ఏ రాజకీయాలు చేస్తున్నావు.. ఆన్న పేరు చెప్పుకుని సినిమాలు, రాజకీయాలలోకి వచ్చి నీతులు చెబుతావా?

  కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం మాది ..
కరుడు గట్టిన టిడిపి కార్యకర్తలకు కూడా పథకాలు  అమలు చేస్తూ జగన్  గారు అందరివాడుగా మంచి చేస్తున్నారు..
-నువ్వు, చంద్రబాబు కలిసి మా పార్టీకి కులం, మతం అంట గడితే ప్రజలు నమ్మరు.

 వైయ‌స్ షర్మిల గారు ఎప్పుడైనా వైయ‌స్‌ జగన్ గారు అన్యాయం చేసారని చెప్పారా..?, లేదే.
 కానీ నీ భార్య మీపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయం మర్చిపోవద్దు..

 కులాలు , మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ జిల్లా ప్రజలు తరిమి తరిమింకొడతారు.. ఖబడ్దార్..

 నీవు ఒక కులానికి, వర్గానికి కొమ్ము కాస్తున్నావు.. కాబట్టే నీకు ఒక హిడెన్ అజెండా ఉంది .

 అత్మాభిమానం అని మోసపు మాటలు వద్దు.. వైఎస్ఆర్ గారి హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచటం వల్ల మా రాయలసీమ కు నీళ్ళు వస్తున్నాయి..

  కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తూ న్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్ ఆర్ సిపిది .. కౌలు రైతులకు కార్డు ఉండి, ప్రభుత్వ సాయం అందక పోయినట్లు నిరూపిస్తే... నువ్వు ఏం చెబితే అది చేస్తాం అని సవాల్ విసురు తున్నా...

నగర మేయర్, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు  సురేష్ బాబు మాట్లాడుతూ..  జన సేన అధినేత పవన్ ఒక వార్డు సభ్యుడుగా కూడా గెలవలేదు.  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే అనవసర ఆరోపణలు చేయడం అర్థరహితం... కేవలం నీ కులానికి చెందిన ప్రాంతంలో బహిరంగ సభ పెట్టావ్.. తప్ప దేనికి ఉపయోగం లేదు... గత టీడీపీ హయాంలో రైతులు చనిపోయినప్పుడు, క్రాప్ ఇన్సూరెన్స్ రానప్పుడు ఎక్కడికి పోయావ్ పవన్..?

తాజా వీడియోలు

Back to Top