టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది  

 డిప్యూటీ సీఎం ఆళ్లనాని 
 

పశ్చిమగోదావరి : గత టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పేర్కొన్నారు.  రైతలను ఎన్నికలకు వాడుకుని వారికి మొండిచేయి చూపిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. జిల్లా కేంద్రమైన ఏలూరు మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ఆళ్లనాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ధాన్యం కొనుగోలుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందుతుందన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాలను మహిళల ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. రైతు భరోసా అమలు చేసి లక్షలాది మంది రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. కొమడవోలు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు ఇస్తామని ప్రకటించారు. 

Read Also: ప్రతీ కుటుంబంలో సంతోషాలను నింపడమే లక్ష్యం

Back to Top