వైయస్‌ జగన్‌ను కలిసిన దాసరి జై రమేష్‌

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒక్కరైన దాసరి జై రమేష్‌ కలిశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ జగన్‌ స్వగృహంలో ఆయన కలిశారు. చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న రమేష్‌ టీడీపీ విధానాలు నచ్చక బయటకు వచ్చారు.

వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని  గ్రహించి జననేతను కలిశారు. ఆయన వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ కూడా ఉన్నారు. దాసరి జై రమేష్‌  దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కాగా రెండు రోజుల క్రితం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీకి రాజీనామా చేసి వైయస్‌ జగన్‌ను కలిశారు. నిన్న అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ కూడా టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. 

Back to Top