ప్రజలందరి నమ్మకం మీపైనే..

సీఎం వైయ‌స్ జగన్‌పై క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రశంసలు

సీఎం వైయ‌స్ జగన్‌కు ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రశంసలు

నౌపడ సభలో సీఎం ప్రసంగం అత్యద్భుతమంటూ ట్వీట్‌  

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలస్తంభమైన మూలపేట పోర్టుకు  శంకుస్థాపన చేసిన తర్వాత.. సీఎం వైయ‌స్ జగన్‌ నౌపడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆ ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దానిని అంబటి రాయుడు రీట్వీట్‌ చేస్తూ.. ‘మన సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్‌’ అంటూ కొనియాడారు.  

మరోసారి వైయ‌స్‌ జగన్‌ సీఎం అయితేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్‌ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.    
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top