ఏపీలో మిలియ‌న్ కోవిడ్ టెస్టులు 

సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌
 

 
 తాడేప‌ల్లి : కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల(మిలియ‌న్‌) మార్క్‌ను దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మిలియ‌న్ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో ఆదివారం సాయంత్రం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ జాతీయ స్థాయిలో కొన‌సాగింది. 

Back to Top