23 నుంచి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు

జూన్ 29, 30, జులై 1వ తేదీల్లో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు 

కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న‌

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి, వై.య‌స్‌.ఆర్‌. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు జులై 8, 9 తేదీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు గల ప్రాంగణంలో పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి.  ప్లీనరీ సన్నాహక సమావేశాలలో భాగంగా ముందు నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలను జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశాలు జూన్ 29, 30, జులై 1వ తేదీలలో జరపాలని పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించారు. ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుని నియోజకవర్గంలో నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీల‌కు సంబంధించిన కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకుని ఆయా తేదీల వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియ‌జేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  

Back to Top