గుంటూరు: వైయస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరులో రాష్ట్రస్థాయి పంపిణీని జెండా ఊపి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రైతన్నలకు ఆర్బికేల వద్దే. మీ గ్రామంలోనే తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతన్నలకు మరింత రాబడి అందించేలా, వారికి మంచి జరిగేలా రూ. 2.016 కోట్ల వ్యయంతో ఆర్టీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ. 15 లక్షల విలువ గల 10.750 వైయస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న జగనన్న ప్రభుత్వం. 3,800 ఆర్బీకే స్దాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు,ట్రాక్టర్లు, 1,140 ఆర్టీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు మరియు 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ చేశారు.