నేడు దర్శి, విజయవాడలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన  

తాడేప‌ల్లి: నేడు ప్రకాశం జిల్లా దర్శి, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దర్శి పట్టణానికి చేరుకుంటారు. అక్కడ జరిగే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించ‌నున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈరోజు సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం వైయ‌స్ జగన్‌ పాల్గొంటారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top