రేపు అవ‌నిగ‌డ్డ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించింది. ఈ నేపథ్యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్‌ పత్రాలను అందజేయనున్నారు. రేపు (గురువారం) ఉద‌యం 10 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అవ‌నిగ‌డ్డ‌కు బ‌య‌ల్దేర‌తారు. 11 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. గంటన్నర పాటు సాగే బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్రసంగిస్తారు. నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు అందజేస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లి త‌న‌ నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top