దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అంబేద్క‌ర్‌

రాజ్యాంగ నిర్మాత‌కు నివాళుల‌ర్పిస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి ఘ‌న నివాళుల‌ర్పిస్తూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్ చేశారు. ``దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేద్కర్‌ జయంతి సంద‌ర్భంగా ఆయనకు ఘన నివాళులు`` అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top