పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత‌ల‌తో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీల‌క సమావేశం ప్రారంభ‌మైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు హాజ‌ర‌య్యారు. నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సీఎం చ‌ర్చిస్తున్నారు. ఇటీవలే నియోజకవర్గాలకు పరిశీలకులను నియ‌మించిన సీఎం.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీలు, భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

Back to Top