ఏపీ భవన్‌లో ఘనంగా సీఎం వైయస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుక

కష్టాలకు తలవంచని వ్యక్తిత్వం వైయస్‌ జగన్‌ సొంతం

ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగులోనూ కమిట్‌మెంట్‌ ఉంటుంది

జననేతగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

ఢిల్లీ: ఒత్తిళ్లు, కష్టాలకు తలవంచని వ్యక్తిత్వం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సొంతమని వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్‌ విద్యార్థులకు ఉపయోగపడే కిట్లు పంపిణీ చేశారు. అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంట్‌ సభ్యులు కేక్‌కట్‌ చేసి సీఎం వైయస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, ఆర్‌.కృష్ణయ్య, తలారి రంగయ్య, రెడ్డప్ప, మాధవ్, వంగా గీత, గురుమూర్తి, మాధవి, కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ, డాక్టర్‌ సంజీవ్‌కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయ వ్యవస్థలోనే సీఎం వైయస్‌ జగన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కున్నప్పటికీ, ప్రతిపక్షాలు వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఎన్ని కష్టాలకు గురిచేసినా తలవంచని వ్యక్తిత్వం వైయస్‌ జగన్‌ సొంతమన్నారు. 

‘వైయస్‌ జగన్‌ వేసే ప్రతి అడుగులోనూ ఒక కమిట్‌మెంట్‌ ఉంటుంది. పాదయాత్ర, ఓదార్పు యాత్రలు చేసి ప్రజల మనసులను, ఆకాంక్షలను తెలుసుకున్నారు. ప్రజల మనిషిగా మారారు. ప్రజల ఆకాంక్షలను ఆకలింపజేసుకొని, దానికి అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలోనే అమలు చేసిన ఘనత వైయస్‌ జగన్‌కే దక్కుతుంది. 

ముఖ్యంగా పేద ప్రజలు, అణగారిన వర్గాలు, రైతులు, యువత, చిన్నారులు, గ్రామాలు, గ్రామ స్వరాజ్యం, పరిపాలన వ్యవస్థలపై పూర్తి అవగాహనతో సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారు. నవరత్నాలతో పేదల బతుకులను మార్చారు.  వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంట్‌ సభ్యుల తరఫున, ఆంధ్రరాష్ట్ర ప్రజల తరఫున జన్మదిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైయస్‌ జగన్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 
 

Back to Top