నేటి నుంచి మూడ్రోజుల పాటు వైయ‌స్ఆర్ జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌

వైయ‌స్ఆర్ జిల్లా: నేటి నుంచి మూడు రోజుల పాటు వైయస్‌ఆర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన సాగనుంది. నేడు కడప అమీన్‌పీర్‌ దర్గాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్ల‌తో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 24వ తేదీన ఇడుపుల‌పాయ‌లోని దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అదే విధంగా పులివెందుల‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నారు. 25వ తేదీన క్రిస్మ‌స్ సంద‌ర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు. అదేరోజు పులివెందుల నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.20 గంటలకు తాడేపల్లిలోని  నివాసానికి చేరుకుంటారు. 

Back to Top