రేపు సీఎం వైయ‌స్‌ జగన్ వైయ‌స్‌ఆర్‌ జిల్లా పర్యటన

జమ్ములమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటన
 

తాడేప‌ల్లి:  రేపు (15.02.2023) సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ వైయ‌స్‌ఆర్‌ జిల్లాలో ప‌ర్య‌టిస్తారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ విడుద‌ల చేశారు. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ, పులివెందులలో వివాహ రిసెప్షన్‌ వేడుకకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ హాజరవుతారు.

ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. 11.10 – 11.30 జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ, శిలాఫలకాలు ఆవిష్కరణ కార్యక్రమం, 11.45 – 12.45 స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం, అనంతరం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.40 కి పులివెందుల చేరుకుంటారు. 2.00 – 2.15 పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top