రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (29.11.2022) గుంటూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రు కానున్నారు. సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ శ్రీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top