గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ పరామర్శ

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్‌ ఆరోగ్య స్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.  

తీవ్ర కడుపు నొప్పితో సోమవారం మణిపాల్‌ ఆస్పత్రిలో గవర్నర్‌ నజీర్‌ చేరిన సంగతి తెలిసిందే. ఆపై వైద్య పరీక్షల్లో అపెండిసైటిస్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు బులిటెన్‌ విడుదల చేశారు. 

ఇక తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి పనుల్లో సోమవారం బిజీగా ఉన్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు గవర్నర్‌ నజీర్‌ ఆరోగ్యంపై ఆరా తీస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇవాళ డోన్‌ పర్యటన ముగించుకుని నేరుగా ఆస్పత్రికే చేరుకున్నారు.

Back to Top