నేడు ప్ర‌కాశం జిల్లా కారుమంచిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రకాశం జిల్లా టంగుటూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం తాడేపల్లిలోని త‌న‌ నివాసం నుంచి హెలికాప్ట‌ర్‌లో బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.05 గంటలకు తాడేపల్లిలోని త‌న‌ నివాసానికి చేరుకుంటారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం వైయ‌స్‌ జగన్‌  మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు.  

Back to Top