మేక‌ల‌పాలెంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

అండ‌గా ఉంటామ‌ని వ‌ర‌ద బాధితుల‌కు సీఎం భ‌రోసా

అంబేడ్క‌ర్ కోన‌సీమ‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం మేకలపాలెంకు చేరుకున్నారు. పి.గ‌న్న‌వ‌రం మండ‌లం పెద‌పూడి, పుచ్చ‌కాయ‌ల‌వారి పేట‌, ఊడుమూడిలంక గ్రామాల్లో ప‌ర్య‌ట‌న అనంత‌రం వాడ్రేవుప‌ల్లికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా రాజోలు మండ‌లం మేక‌ల‌పాలెంకు చేరుకున్నారు. గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. ప్ర‌భుత్వం నుంచి నిత్యావ‌స‌ర స‌రుకులు, ఆర్థిక‌సాయం అందిందా అని ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కాలిన‌డ‌క‌నే మేక‌ల‌పాలెంలోని ప్ర‌జ‌లంద‌రినీ ప‌ల‌క‌రించారు. కరకట్టవాసి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మేకలపాలెంలో ఏటిగట్టును పరిశీలించారు. బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top