ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు ఇండోర్ స్టేడియం చేరుకున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాహనమిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాగా, స్టేడియంలో ఏర్పాటు చేసిన నవరత్నాల స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.