9న విశాఖకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 9న విశాఖపట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆహ్వానం మేరకు.. చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా శ్రీ శారదా పీఠానికి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. వార్షికోత్సవంలో భాగంగా పీఠంలో నిర్వహించే రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో పాల్గొననున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.  

Back to Top