మీ అద్భుతమైన ఆట తీరు యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది 

తాడేప‌ల్లి: ఫైనల్ మ్యాచ్‌ ఫలితం నిరాశపరిచినా.. ఈ విడత వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత్ క్రీడాకారుల అన్ని మ్యాచ్‌ల్లో వారు కనబరిచిన ఆట తీరు ప్రజల హృదయాలను గెలుచుకుందని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి కొనియాడారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. `2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో  అద్భుతమైన ప్రయాణం చేసినందుకు భారత క్రికెట్ జట్టులోని క్రీడాయోధులకు నా ప్రశంసలు. ఫైనల్ మ్యాచ్ మనకు అనుకూలంగా లేక‌పోయినా.. ఈ ప్రయాణంలో టీమిండియా ఆట‌గాళ్ల‌ స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తి, టోర్నీ మొత్తంగా వివిధ సందర్భాల్లో వారు కనబరిచిన అద్భుతమైన ఆట తీరు యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. టీమ్ ఇండియా! మీరు హృదయాలను గెలుచుకున్నారు` అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top