తాడేప‌ల్లికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ముగిసిన సీఎం వైయ‌స్‌ జగన్ వైయ‌స్ఆర్ జిల్లా  పర్యటన
 

 

తాడేప‌ల్లి :  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యానికి చేరుకున్నారు.  వైయ‌స్ఆర్ జిల్లా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి సీఎం బయలుదేరారు. ​మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మొదటిరోజు గురువారం.. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేల్పులలో నిర్మించిన మోడల్‌ సచివాలయ భవన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి సందర్శించి ప్రారంభించారు. సచివాలయం, వైయ‌స్సార్‌ విలేజ్‌ హెల్త్‌క్లినిక్, రైతు భరోసా కేంద్రంతో పాటు అన్ని కార్యాలయాలలో కలియదిరిగారు. గ్రామ సచివాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ అరగంటకు పైగా గడిపారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు.

రెండోరోజు..
దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైయ‌స్‌ విజయమ్మ, వైయ‌స్‌ భారతి, వైయ‌స్‌ షర్మిల వైయ‌స్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైయ‌స్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు.

తాజా వీడియోలు

Back to Top