విశాఖ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి రోడ్డు మార్గంలో గ‌న్న‌వ‌రం చేరుకున్న‌ సీఎం.. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో విశాఖ‌ప‌ట్ట‌ణం బ‌య‌ల్దేరారు. విశాఖ‌ నగరంలోని కైలాసపురం వద్ద దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 17 ఎకరాల్లో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం జరగనుంది. అదే విధంగా గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేపడుతున్న రూ.136 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల నిర్మించిన ఫార్మా ఇంక్యుబేషన్‌ సెంటర్, ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషన్‌ బిజినెస్‌ సెంటర్‌ ప్రాంగణాలను సీఎం ప్రారంభించనున్నారు.

Back to Top