గుంటూరు తొక్కిసలాట ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్ష‌త‌గాత్రుల‌కు రూ.50 వేల చొప్పున ప‌రిహారం  

తాడేప‌ల్లి: గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.

Back to Top