కారు ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సీరియ‌స్‌

ప్రకాశం: ఒంగోలులో ఆర్టీఏ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్‌ కోసం వాహనాలు సమకూర్చాలని సిబ్బంది ఒత్తిళ్లు తెస్తున్నారంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌ దృష్టికి వార్తా కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన సీఎం ప్రజలను ఇబ్బందులు పెడితే సహించబోమంటూ గట్టి సంకేతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఒంగోలు ఏఎంవీఐ సంధ్య, హోంగార్డ్‌ తిరుపాల్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

తాజా ఫోటోలు

Back to Top