గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌పై సీఎం స‌మీక్ష‌ ప్రారంభం

తాడేప‌ల్లి: గ‌్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ ప‌నితీరుపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా సమావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశానికి పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌లు, ద‌ర‌ఖాస్తుదారుల‌కు నిర్దిష్ట కాల‌ప‌రిమితిలో అందిస్తామ‌న్న ప‌థ‌కాలు, వాటి అమ‌లు, ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top