సహకార రంగాన్ని బలోపేతం చేయాలి

పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యం

అమూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

షుగర్‌ ఫ్యాక్టరీలు, మిల్క్‌ డెయిరీలపై సీఎం సమీక్ష

తాడేపల్లి: సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకుపడాలని,  పాడి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. షుగర్‌ ఫ్యాక్టరీలు, మిల్క్‌ డెయిరీల అభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంçపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పాడి పరిశ్రమాభివృద్ధిపై దృష్టిసారించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. అమూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంపై విధి విధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ నుంచి.. ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించే దిశగా అడుగులు వేయాలన్నారు. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించేడమే లక్ష్యంగా చేసుకోవాలన్నారు. పాడి రైతులకు మేలు జరగాలని, వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని అధికారులకు సూచించారు. ధరల విషయంలో రైతులకు న్యాయం జరగాలని, సహకార రంగం బలోపేతం కావాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

Back to Top