తాడేపల్లి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పాలసీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ బి.సుందర్, ఎనర్జీ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్, ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ ఎండీ ఎం. మధుసూదన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.