తాడేపల్లి: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ఎన్.భరత్ గుప్తా, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ షన్‌మోహన్, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐడీసీ ఛైర్‌పర్సన్ బండి పుణ్యశీల, ఏపీటీపీసీ ఛైర్మన్ కె రవిచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఛైర్ పర్సన్ షమీమ్ అస్లాం, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారు రాజీవ్ కృష్ణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ సలహాదారు లంక శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.