కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

వైద్య ఆరోగ్యశాఖపై స‌మీక్ష‌లో సీఎం  వైయస్‌.జగన్‌ 

వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది భర్తీ, మందుల పంపిణీ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, బోధనాసుపత్రుల నిర్మాణంపై చ‌ర్చించిన సీఎం 

 జనవరి 26 నాటికి విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు పూర్తి కావాలన్న సీఎం.

 తాడేప‌ల్లి: కోవిడ్‌ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను  తనిఖీ చేయాలని, జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న సీఎం. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలని సూచించారు. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్‌ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలన్నారు.  ఇవాళ వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. 

 • వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది భర్తీ, మందుల పంపిణీ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, బోధనాసుపత్రుల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం.
 • కోవిడ్‌ వ్యాప్తి, తాజా పరిణామాలపై సీఎంకు వివరాలందించిన అధికారులు.
 • ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యత, ప్లాంట్ల పనితీరు వంటి వాటిపై ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్టు తెలిపిన అధికారులు.
 • ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నామన్న అధికారులు.
 • *ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....:*
 • వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీపై సీఎంకు నివేదిక సమర్పించిన అధికారులు.
 • జనవరి 26 నాటికి  మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం. 
 • ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కూడా కల్పించాలన్న సీఎం.
 • జనవరి 26 నాటికి విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు కూడా పూర్తి కావాలన్న సీఎం.
 • విలేజీ క్లినిక్స్‌ మొదలుకుని సీహెచ్‌సీలతో సహా బోధనాసుపత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలన్న సీఎం.
 • దీనికోసం ఎస్‌ఓపీ రూపొందించాలన్న సీఎం.
 • విలేజ్‌ క్లినిక్‌లు మొదలుకుని బోధనాసుపత్రుల వరకు మందులు కొరత అన్న మాటే ఉండరాదన్న సీఎం.
 • వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపైనా సీఎం సమీక్ష.
 • ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలన్న సీఎం.
 • కొత్తగా మంజూరు చేసిన పార్వతీపురం మెడికల్‌ కాలేజీ సహా అడక్కడగా ప్రారంభంకాని బోధనాసుపత్రుల పనులను వెంటనే ప్రారంభించాలన్న సీఎం. 
 • జనవరి 26 నాటికి పార్వతీపురంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా చేపడుతున్న అన్ని మెడికల్‌ కాలేజీల్లో నిర్మాణ పనులు మొదలు కావాలన్న సీఎం.
 • *ఆరోగ్యశ్రీపైనా సీఎం సమీక్ష.*
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు అవసరమైన 104 వాహనాలను జనవరి 26 నాటికి సిద్ధంచేసుకోవాలన్న సీఎం. 
 • 104 సేవలను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్న సీఎం.
 • ఆరోగ్యశ్రీ రిఫరల్‌కు సంబంధించిన యాప్‌ ఏఎన్‌ఎం, ఆరోగ్యమిత్రతో సహా అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం.
 • ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులో ఫాలో అఫ్‌ మెడిసన్‌ అందుతుందా లేదా అన్న దానిని పరిగణలోకి తీసుకోవడంతోపాటు గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్‌ సిబ్బంది  ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకోవాలన్న సీఎం.
 • *కోవిడ్‌ వ్యాప్తి నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష.*
 • ఏపీలో ఇప్పటివరకు కోవిడ్‌ న్యూ వేరియెంట్‌ బీఎప్‌– 7 ఎక్కడా నమోదు కాలేదన్న అధికారులు.
 • కోవిడ్‌ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్‌ క్లినిక్‌లు కేంద్రంగా చికిత్స అందాలన్న సీఎం.
 • ఆ మేరకు ఎస్‌ఓపీలుండాలన్న సీఎం.
 • టెస్టింగ్, మెడికేషన్‌ విలేజ్‌ క్లినిక్‌ కేంద్రంగా జరగాలన్న సీఎం.
 • ఏఎన్‌ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్‌ క్లినిక్‌ల కేంద్రంగా అందుబాటులో ఉండాలన్న సీఎం.
 • పీహీచ్‌సీల పర్వవేక్షణలో విలేజ్‌ క్లినిక్‌లు పనిచేయాలన్న సీఎం.
 • మాస్కులు ధరించడంతో పాటు కోవిడ్‌ నివారణ చర్యలపై అవగాహన కలిగించాలన్న సీఎం.
 • అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలన్న సీఎం.
 • ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్న సీఎం.
 • కోవిడ్‌ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను ముందుగా తనిఖీ చేయాలన్న సీఎం.
 • జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న సీఎం.
 • ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలన్న సీఎం.
 • మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్‌ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలన్న సీఎం.
 • రోజుకు 60వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ కెపాసిటీ గతంలో ఏర్పాటు చేశామన్న అధికారులు.
 • ప్రస్తుతం రోజుకు 30 వేల టెస్టింగ్‌ సామర్ధ్యముందన్న అధికారులు.
 • విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్స్‌ ల్యాబు కూడా అందుబాటులో ఉందన్న అధికారులు.
 • 13 చోట్ల టెస్టింగ్‌ ల్యాబులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపిన అధికారులు.
 • మరో 19 చోట్ల టెస్టింగ్‌ ల్యాబులు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.
 • అన్ని ఆసుపత్రుల్లోనూ మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
 • అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు.
 • కోవిడ్‌ లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్‌ క్లినిక్స్‌కు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రిఫర్‌ చేసేలా ఉండాలన్న సీఎం.
 • 320 టన్నుల మెడికల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు.
 • ఎన్‌ – 95 మాస్కులు, కోవిడ్‌ పీపీఈ కిట్స్‌ అందుబాటులో ఉంచుతామన్న అధికారులు.
 • ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి,  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ  కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top