పాఠశాల తెరిచే నాటికి జగనన్న విద్యా కానుక సిద్ధం

స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష
 

తాడేపల్లి: స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు విద్యార్థులకు అందజేస్తున్నట్లు చెప్పారు. బడి తెరిచే నాటికి ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, షూ, సాక్స్‌, బెల్ట్‌, బ్యాగ్‌, నోట్‌, టెక్ట్స్‌ బుక్స్‌ పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.నాడు-నేడు తొలి విడతలో భాగంగా 15,700 స్కూళ్లలో పనులు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంపై సీఎం సమీక్షించారు. డిజిటల్‌ బోధనకు ప్రతి పాఠశాలలో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేయాలన్నారు.

Back to Top